గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మరోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమేశ్ కుమార్ విషయంలో హైకోర్టును తప్పు పట్టడం లేదని…కానీ ఆ వ్యవహారం బాగాలేదన్నారు.
తమకు ఇష్టం లేని ఐఏఎస్ లను కేంద్రం బలి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాలు సైతం తమకు అనుకూలంగా ఉన్న అధికారులను పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకు ఎందుకు మారిందో బీజేపీ చెప్పాలన్నారు. బెదిరించి, భయపెట్టి నాయకులను బీజేపీ వైపు తిప్పుకుంటున్నారని.. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులు ఖిల్లా.. బీజేపీని జిల్లాలో అడుగు పెట్టనివ్వమని అన్నారు.
ఈ నెల 18న జరగబోయే బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరవుతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్,లెఫ్ట్ పార్టీల ఎజెండా ఒక్కటేనని..బీజేపీని నిలువరించడమేనని అన్నారు. ఏప్రిల్ లో ఖమ్మం జిల్లాలో సీపీఐ భారీ బహిరంగ సభ ఉంటుందని కూనంనేని సాంబశివ రావ్ స్పష్టం చేశారు. అయితే తెలంగాణ రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ ఎపిసోడ్ నడిచినప్పుడు కూడా కూనంనేని గవర్నర్ తమిళి సై పై విమర్శలు కురిపించారు.
బిల్లుల ఆమోదం పై గవర్నర్ సూపర్ పవర్ ఉందని చెప్పుకుంటుందని.. అలాంటిదేమీ రాజ్యాంగంలో గవర్నర్లకు కల్పించలేదన్నారు. ఇక ప్రభుత్వం చేసిన చట్టాలకు ఆమోద ముద్ర వేయాల్సిన బాధ్యత గవర్నర్ ది అన్నారు. కేవలం గవర్నర్ రబ్బర్ స్టాంపు మాత్రమే అన్నారు.