పుదుచ్ఛేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ ఇంచార్జ్ లెఫ్టనెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో సీఎం నారాయణస్వామి రాజీనామా చేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలు కూడా ఏవీ ముందుకు రాకపోవటంతో ఇంచార్జ్ లెఫ్టనెంట్ గవర్నర్ గా ఉన్న తమిళిసై రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. క్యాబినెట్ ఆమోదముద్ర వేస్తే… హోంశాఖ సూచన, గవర్నర్ సలహా మేరకు రాష్ట్రపతి పాలనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం 33మంది సభ్యులున్న పుదుచ్ఛేరి అసెంబ్లీలో పలువురు రాజీనామా చేయటంతో సంఖ్య 27కు పడిపోయింది.