జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్నేషియా పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి సామాూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ స్పందించారు. అందుకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లను ఆదేశించారు గవర్నర్.
మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ ఏడాది మే 28 న అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్న విద్యార్ధులు సాయంత్రం ఐదు గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు.
అయితే.. పబ్ లోనే ఓ మైనర్ బాలికను ట్రాప్ చేసిన ఆరుగురు యువకులు.. కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.