గవర్నర్ అనగానే అధికారుల హాడావిడి, గవర్నర్ వచ్చే సరికే ప్రయాణం ఎదైనా ఏర్పాట్లు పూర్తై ఉంటాయి. కానీ మహారాష్ట్ర గవర్నర్ మాత్రం తను ప్రయాణించాల్సి హెలికాప్టర్ కోసం ఏకంగా 2గంటల పాటు ఎయిర్ పోర్టు లాంజ్ లో వెయిట్ చేశారు. అప్పటికీ హెలికాప్టర్ సిద్ధంకాకపోయే సరికి చేయాల్సిందేమీ లేక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే-
సీఎం ఉద్ధవ్, గవర్నర్ కోషియారి మధ్య విభేదాలు మరోసారి భయటపడ్డాయి. గవర్నర్ కోషియారి గురువారం డెహ్రాడూన్ పర్యటనకు రెడీ అయ్యారు. ప్రభుత్వ హెలికాప్టర్‌లో వెళ్లబోతున్నట్లు వారం క్రితమే అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. కానీ సర్కార్ సైలెంట్ గా ఏర్పాట్లేమీ చేయలేదు. గవర్నర్ హెలికాప్టర్ కోసం 2గంటల పాటు వెయిట్ చేశారు. ఆ తర్వాత 15 నిమిషాలకు అధికారులు వచ్చి అనుమతి రాలేదని చెప్పటంతో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకకొని వెళ్లిపోయారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని గవర్నర్ కార్యాలయ అధికారులు మండిపడుతున్నారు.