చెంచుల జీవితాల బాగు కోసం విద్య, వైద్య, ఆరోగ్యం రంగాలకు ప్రాధాన్యతను కల్పించేందుకు కృషి చేస్తానని.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో నివాసముంటున్న చెంచు గుడాలను ఆమె సందర్శించారు. మన్ననూరులోని మృగ వాణి అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం, ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు గవర్నర్.
గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య ఉపకేంద్రం, టైలరింగ్ శిక్షణా కేంద్రం, ఆశ్రమ పాఠశాలలను ప్రారంభించారు గవర్నర్. సర్పంచ్ లకు ద్విచక్ర అంబులెన్స్ లను అందజేశారు. ఆశ్రమ పాఠశాలకు చేరుకొని అక్కడ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ తర్వాత అప్పాపూర్ చెంచు గూడానికి చేరుకున్నారు. అక్కడి చెంచులు సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ గవర్నర్ కు స్వాగతం పలికారు.
చెంచుల ఇండ్లలోకి వెళ్లిన గవర్నర్.. వారి జీవన స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. వారి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు. గిరిజన వాసులంతా ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ప్రతీ ఒక్కరు విద్య నేర్చుకునేందుకు తగిన చర్యలను చేపడుతామని హామీ ఇచ్చారు. ఒక గవర్నర్ గానే కాకుండా.. ఓ డాక్టర్ గా కూడా చెంచుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాల్సిన బాధ్యత తనపైన ఉందని అన్నారు తమిళసై.
ఈ సందర్భంగా ఆమె చెంచుల ఆరాధ్యదైవాలు అయిన భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, తదితర దేవతలను సందర్శించారు. వివిధ చెంచు పెంటలు నుంచి తరలివచ్చిన జనాలతో గవర్నర్ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చెంచు పంటలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. మరోసారి ఈ ప్రాంతాలలో పర్యటిస్తానని అప్పటి లోపు మీ జీవితంలో మార్పులు రావాలని గవర్నర్ చెంచు