యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం కొండపైకి చేరుకున్న గవర్నర్ కు కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆలయం వద్ద ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా స్వయంభు ఆయలంలోకి వెళ్లిన గవర్నర్.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్ కు ఆశీర్వచనం చేశారు.
అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. తరువాత ఆమె మీడియాతో మాట్లడకుండా వెళ్లిపోతూ.. అందరికీ బెస్ట్ విషెస్ అంటూ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కామెంట్ చేశారు. ఇక ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ రోజు మధ్యాహ్నం 12.10 గంటలకు శాసన మండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు. గత కొంత కాలంగా గవర్నర్ తమిళి సై ,కేసీఆర్ ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల విరామం తరువాత గవర్నర్ తమిళి సై శాసన మండలి, శాసన సభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనుండడంతో ఆసక్తి నెలకొంది.