కంగనా రనౌత్ అంశం పొలిటికల్ తీసుకుంది. ముంబైని పాక్ ఆక్రమతి కాశ్మీర్ తో పోల్చటం, శివసేన ఫైర్ అవుతూ ముంబైలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించటం, ఎవరు ఆపుతారో చూస్తానంటూ కంగనా ముంబై వచ్చేలోపు ఆమె ఇల్లు కూల్చివేటం, కంగనా నేరుగా సీఎంనే టార్గెట్ చేయటంతో వివాదం మరింత ముదిరింది.
తాజాగా ఈ అంశంపై గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి సీన్ లోకి ఎంటరైపోయారు. బీఎంసీ అధికారుల తీరుపై సీఎం ఉద్ద్ థాక్రే సలహాదారుతో ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల తీరుపై ఆయన అసహానం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మొత్తం అంశంపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది.
అంతేకాదు కంగనా తన రాజకీయ విమర్శలను మరింత పెంచింది. శివసేన కాస్త సోనియా సేనగా మారిపోయిందని విమర్శలు గుప్పించింది.