విశాఖ జరిగిన ప్రమాదం దిగ్బ్రాంతి చెందిన చంద్రబాబు విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. విశాఖ వెళ్లి బాధితులను పరామర్శించాలి కాబట్టి ఈ అనుమతి కోరారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఉంటున్నారు. చంద్రబాబుకు విశాఖ పర్యటనకు వెళ్లేందుకు ప్రభుత్వ హోంశాఖ అనుమతించింది.
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి ఎల్జీ పాలిమర్స్ ప్రాంతానికి, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లనున్నారు.