కరోనా వైరస్ నియంత్రణకు, ఆర్ధిక ఇబ్బందులను తొలగించేందుకు పరిశ్రమల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీ చాంబర్స్ ను ఆదేశించింది. ఆయా చాంబర్స్ తమ కార్పోరేట్ మెంబర్స్ కు ఈ విషయాన్ని తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు పెద్ద ఇండస్ట్రీ చాంబర్స్ సీఈవోలు, ఎండీలు లకు ఆఫీస్ మెమోరాండం పంపింది. మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని అడ్వైజరీ జారీ చేయాలని డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ ను ప్రభుత్వం కోరింది.
కరోనా వైరస్ వ్యాప్తితో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించినా ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవద్దు…అది దేశ ఆర్ధిక వ్యవస్థకు దీర్ఘకాల సమస్యలను స్రుష్టిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు సాధ్యమైనంత వరకు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోం చేసేలా ప్రోత్సహించాలని డిపిఐటి అన్ని ఇండస్ట్రియల్, కార్పోరేట్ ఆఫీసులను కోరింది. హెల్త్ ఎమర్జెన్సీ కాలంలో అది మెయింటెయిన్ అయ్యేలా చూడాలంది. ఎక్కువ మంది కార్మికులు పని చేసే ఫ్యాక్టరీస్ ను శానిటైజేషన్ చేయాలని ఆదేశించింది. ఫ్యాక్టరీల్లోని అన్ని ఎంట్రన్స్ లు, ఎగ్జిట్ ల దగ్గర ఇతర చోట్ల శానిటైజర్స్ ఉంచాలి..ఎంట్రీ దగ్గర ప్రతి వర్కర్ టెంపరేచర్ టెస్ట్ చేయాలి..వర్కర్లు మాస్క్ లు ఉపయోగించేలా చూడాలని పేర్కొంది.