డా, కేతూరి వెంకటేష్
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
కరోన ఖర్చుల మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
1)కేంద్రం నుండి వచ్చిన నిధుల లెక్క లేదు.
2)ఎంపీ లు ఇచ్చిన డెవలప్మెంట్ ఫండ్ లెక్క తేలలేదు.
3)MLA ల CDS(constuency development found) ఎంత వచ్చిందో చెప్పలేదు.
4) దాతల విరాళాలు ఇచ్చిన సొమ్ము ఎంతనో లెక్క పత్రం లేదు.
5) ప్రభుత్వం కరోన ఫండ్ కేటాయింపు ఎక్కడ ఎందుకు ఖర్చు చేశారో చెప్పలేదు.
6)ఇస్తానన్న బియ్యం లో కేంద్రం ఇస్తున్నది ఎంత మీరు ఇస్తున్నది ఎంత లెక్క పత్రం ఉండదు.
ఏ జిల్లాలో కూడా కరోన టెస్ట్ చేసే కేంద్రం ఏర్పాటు చేయకుండా ఒక్క హైదరాబాద్ లో మాత్రమే వ్యవస్తికృతము చేయడం వెనక మతలబు ఏంటో సెలవివ్వాలి .కనీసం ప్రభుత్వం ఇంట్లో ఉండండి అని చెప్పడం తప్పితే ఎలాంటి నివారణ కోసం తాత్కాలిక ద్రవాణాలను పిచికారీ చేయడం లాంటి చర్యలు తీసుకోలేదు .ఈవిషయంలో స్వీయ నియంత్రణ చర్యలు తీసుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలి .కానీ
ఉధ్యోగులకు న్యాయ బద్దంగా రావాల్సిన వి ఇవ్వకుండా ,కాంట్రాక్టు ఉద్యోగులకు పనికి సరిపడా వేతనం చెల్లించకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా వాడీ జీతం కోస్తా వీడి పించన్ గుంజుత,ఇచ్చినతనే తీసుకోవాలి అని చెప్పడం నియంతృత్వమే …
వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తున్న వారికి రాయితీలు తగ్గిస్తామన్న మాట మాత్రం పాలకుల నోటినుండి రాదు.
అయ్యా అధికార పక్ష నాయకులరా మీకు కరోన మిమ్మల్ని కాటేయ్యక ముందే ఈ లెక్క పత్రం లేని గారడీని కనికట్టుని జర లెక్క విప్పేలా చూడండి.
a అయ్యా పేపరోళ్లు,టీవీల్లోళ్ళు ఏదయినా ఆపద వస్తే ఆదుకునోళ్ళ ఆపేరు ఊరు ఇచ్చిన డబ్బుల ఎంతో రాస్తారు కదా ..కానీ కరోన దాతల పేర్లు ఇచ్చిన పైకం ఎంతో అవుతున్న ఖర్చుఎంతో ఎందుకు రాయడం లేదు.