మరణం తరువాత కూడా కోడెలపై కొనసాగుతున్న ప్రభుత్వ వేధింపులు
యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో కోడెల విగ్రహం ఏర్పాటుపై వివాదం
అనుమతి లేదంటూ విగ్రహం కోసం ఏర్పాటు చేసిన దిమ్మెను ధ్యంసం చేసిన అధికారులు
విగ్రహాల కోసం వారం క్రితమే కలెక్టర్ అనుమతి కోరిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు
అధికారుల తీరుపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ విగ్రహ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన దిమ్మెను అనుమతులు లేవంటూ అధికారులు కూల్చివేశారు. గుంటూరు జిల్లా లింగారావు పాలెంలో నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిని ఈ సంఘటనపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు ఈ దిమ్మెను కూల్చివేశారు. లింగారావు పాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సమీపంలో కోడెల విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం నాయకులు అన్ని ఏర్పాట్లూ చేశారు. సోమవారం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సివుంది. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ అధికారులు దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది.
Advertisements