తెలంగాణ కరోనా లెక్కల్లో మరో కన్ఫ్యూజన్ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిప్పటి నుంచి కరోనా బులిటెన్‌ను పద్దతిగానే ఇస్తున్నట్టు పైకి కనిపించినా.. మళ్లీ ఎక్కడో తేడాకొడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రతి రోజూ విడుదల చేస్తున్న బులెటిన్‌లోని మొదటి పేజీని పరిశీలిస్తే.. కింది భాగంలో ఆరోజున చేసిన కరోనా పరీక్షల సంఖ్య వివరాలతో పాటు పెండింగ్‌లో ఉన్న రిపోర్ట్‌ల సంఖ్యను ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఈ పెండింగ్ రిపోర్ట్‌ల లెక్కను మరుసటి రోజు బులెటిన్‌లో ఎక్కడా ప్రస్తావించడం లేదు.
ఆగస్టు 1 నుంచి నేటివరకు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్లను గమనిస్తే.. సగటున రోజుకి వెయ్యికిపైనే రిపోర్ట్‌లు పెండింగ్‌లో ఉంటున్నాయి. అందులో ఎంత మందికి ఫలితం పాజిటివ్ వచ్చిందో.. లేక నెగెటివ్ వచ్చిందో అస్సలు తెలియకుండా పోతోంది. మరుసటి రోజు బులెటిన్‌లో కూడా ఆ వివరాలను ఎక్కడా ప్రభుత్వం ప్రస్తావించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఆగస్టు 1 నుంచి తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించిన బులెటిన్‌లో రోజూవారీ పెండింగ్‌లో ఉన్న రిపోర్టులను ఓసారి పరిశీలిస్తే..
పెండింగ్ రిపోర్టులు
ఆగస్టు 1 883
ఆగస్టు 2 1656
ఆగస్టు 3 1414
ఆగస్టు 4 919
ఆగస్టు 5 1167
ఆగస్టు 6 1550
ఆగస్టు 7 1539
ఆగస్టు 8 1596
ఆగస్టు 9 1509
ఆగస్టు 10 1700
ఆగస్టు 11 959
ఒక్కసారి పై లెక్కలను పరిశీలిస్తే.. సగటునGovt Officials Golmal in Telangana Coronavirus Cases రోజుకి 1300కుపైనే చొప్పున రిపోర్టులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. అందులో ఎంత మందికైనా పాజిటివ్ ఉండొచ్చు.. లేక అస్సలే ఉండకపోవచ్చు.. ఒకవేళ భారీ సంఖ్యలో పాజిటివ్‌లే ఉంటే.. రోజు వారీ సంఖ్యలో కూడా భారీ పెరుగుదలే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టెస్టుల్లో 10 శాతం వరకు పాజిటివ్ నిర్ధారణ అవుతున్నాయి. ఆ లెక్కన రోజుకి కనీసం 130 చొప్పున లెక్క మిస్ అవుతోంది. పైన పేర్కొన్న 9 రోజల పెండింగ్ రిపోర్టులన్నీ కలిపితే 14వేల 892 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఎంత మందికి వచ్చిందో చెప్పేవారెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు.