దేవ ప్రయాగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలకనంద, భగీరథి నదులను కలిపే పుణ్య ప్రదేశం. ఈ రెండు నదుల కలయిక తర్వాతే గంగానది ప్రవాహం కొనసాగుతుంది. ప్రతీ ఏడాది ఇవి కలిసే సమయంలో అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఓ అద్భుతమైన ఫోటోను ట్వీట్ చేసింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తోంది కేంద్రం. ఏడాదిపాటు పలు కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఈ అలకనంద, భగీరథి నదుల సంగమానికి సంబంధించిన ఫోటోను అమృత్ మహోత్సవ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పిక్ ఆఫ్ ది డేగా క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో వైరల్ అవుతోంది. చూడడానికి ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతవరకు అక్కడకు వెళ్లని వారు వెంటనే వెళ్లాలని అనిపిస్తోందని అంటున్నారు.
రుషికేశ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే దేవ ప్రయాగ వస్తుంది. ప్రయాగ అంటే రెండుగాని అంతకన్నా ఎక్కువ నదులు సంగమించే ప్రదేశం. మరో అర్థం కూడా ఉంది. తపస్సు చేసే ప్రదేశాన్ని కూడా ప్రయాగ అని అంటారు. దేవతలు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దేవప్రయాగ అనే పేరు వచ్చినట్లుగా చెబుతారు.
టిబెట్ భూభాగంలో గల సతోపంత్ హిమనీ నదములో పుట్టిన సరస్వతీ నదికి ఉపనదలుగా ఉన్న నందాకిని, దౌళి గంగ, పిండారి గంగ, మందాకిని కలసి అలకనందగా మారి దేవ ప్రయాగ చేరుతుంది. ఇక గంగోత్రి హిమనీ నదము నుండి ఉద్భవించి ప్రవహిస్తూ సోన్ గంగ మొదలయిన నదులతో సంగమించి టెహ్రీ మీదుగా భగీరథి నది రూపంలో ప్రయాగ చేరుతుంది. ఇక్కడి నుంచే గంగానదిగా సముద్రంలో కలుస్తుంది.
Like a river flows…
This 'flawless' image of the Alaknanda river from the point where it flows into Bhagirathi in Devprayag is giving us major #TravelGoals. How about you? #AmritMahotsav #PicOfTheDay 📸#MainBharatHoon #IndiaAt75 #IncredibleIndia @incredibleindia @tourismgoi pic.twitter.com/7MfBgso7oK— Amrit Mahotsav (@AmritMahotsav) June 1, 2022