జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి డిజిటల్ పద్ధతిలో ఓటరు ఐడీ కార్డులను జారీ చేస్తోంది. మొబైల్ ద్వారా కూడా ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందే అవకాశముంటుంది. ఆన్‌లైన్ నుంచి పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. గత నవంబర్ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఈనెలాఖరు వరకు.. అంతకు ముందే ఓటు హక్కు ఉన్నవారికి ఫిబ్రవరి నుంచి ఎలక్ర్టానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డులు జారీ చేయనుంది ఈసీ.
18 ఏళ్లు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు జాబితాను విడుదల చేస్తుంది. ఇప్పటివరకు ఓటర్లు ఐడీ కార్డు కోసం మీ-సేవా కేంద్రాల్లో తీసుకోవాల్చి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా నేరుగా ఓటర్లే ఓటర్ ఐడెంటీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.