అసోం ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఇకపై కీలక ప్రాంతాల్లో పరీక్షలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లు, రోడ్డు మార్గాలు, ఎయిర్‌పోర్టుల్లో వచ్చే నెల 1 నుంచి కరోనా పరీక్షలు నిర్వహించకూడదని భావిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటన చేశారు. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా విమానాశ్రయల్లో కూడా టెస్టులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.
అసోంలో ఇప్పటిదాకా మొత్తం 2,17,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 1680 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత నెలలోనే పాఠశాలలు ప్రారంభమయ్యాయి.