దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జనవరి 16న దేశంలో మొదటి విడత వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. తొలి దశలో దాదాపు కోటి మందికి టీకా వేశారు. ఇందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మార్చి నెల నుంచి రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు 45-60 ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 2కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా తెలిపింది.
2 కోట్ల డోసుల్లో కోటి 71లక్షల మందికి తొలి డోసు అందించగా, మరో 37లక్షల 54వేల మందికి రెండు డోసులు అందించారు. గత గంటల్లో 14లక్షల 24వేల డోసులను పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 21లక్షల డోసులను అందించారు.