సచివాలయంలో ఉద్యోగం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సచివాలయంలో ఉద్యోగం వస్తే బాగుండు అన్న ఆశ ఉంటుంది. అలాంటి సచివాలయంలో పోస్టుల భర్తీకి ముహుర్తం ఖరారైంది. ఏపీలో సచివాలయం పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ప్రక్రియను పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏయే శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో చూస్తే…
1. వెటర్నరీ విభాగంలో… 4000పోస్టుల వరకు ఖాళీలున్నట్లు తెలుస్తోంది.
2.మూడు విభాగాల్లో ఉద్యోగల భర్తీలో రిజర్వేషన్లు, ఇతరత్రా భర్తీకాని ఉద్యోగాలు దాదాపు 15వేల వరకు ఉన్నట్లు సమాచారం.
3. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు 2వేలకు పైగానే ఉన్నాయి.
4. కోర్టు ఆదేశాల మేరకు ఏఎన్‌ఏం లేదా వార్డు హెల్త్ సెక్రెటరీ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గతంలో 13వేల పైచిలుకు ఖాళీలు భర్తీ చేసే ప్రక్రియలో మిగిలిన పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
మరి ఎంపీ మాధవ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తారా…?
దాంతో భారీగా ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఇప్పటికే కోచింగ్ సెంటర్లు ఆశావాహులతో కిటకిటలాడుతున్నాయి.