ఇండియాలో భారీ ఎత్తున వైఫై నెట్‌వర్క్‌ను ప్రారంభించే ప్లాన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా పబ్లిక్ వైఫై సర్వీస్‌ను అందించే వైఫై నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. ఇందుకోసం ఎలాంటి లైసెన్స్ ఫీజు విధించబోమని కేంద్రం స్పష్టం చేసింది.
పబ్లిక్ వై ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్ ఫేస్‌ను పీఎం-వాణి (PM-WANI) పేరుతో పిలవనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలో పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలోనే దేశంలో పబ్లిక్ డేటా సెంటర్లను ప్రారంభించనున్నారు.