హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రేపు పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నారు. ప్రమాదం వివరాలను ఆర్మీ చీఫ్ ను అడిగి తెలుసుకున్న రాజ్ నాథ్ సింగ్ అనంతరం కేబినేట్ సమావేశానికి హాజరైయ్యారు. మంత్రి మండలికి ప్రమాదం గురించి వివరించారు. మీటింగ్ పూర్తైన తరువాత రాజ్ నాథ్ సింగ్ సహా ఆర్మీ అధికారులు బిపిన్ రావత్ ఇంటికి వెళ్లారు.
కాగా, తమిళనాడు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం జరిగింది. సీడీఎస్ బిపిన్ రావత్ భార్య చనిపోగా.. రావత్ పరిస్థితి విషమంగా ఉంది.