పదకొండవ జ్యోతిర్లింగం అయిన కేదారీనాథ్ ధామ్ ఆలయ ద్వారాలు భక్తుల కోసం నేడు తెరుచుకున్నాయి. వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలను అధికారులు నేడు ఉదయం 6.25 గంటలకు తెరిచారు.
నేటి నుంచి ఆరు నెలల వరకు భక్తులు కేదారీనాథ్ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఆలయంలో మొదటి పూజను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరుపై నిర్వహించారు.
ఆలయంలో ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆశీర్వాదాలను ఆయన తీసుకున్నారు.
కేదారీనాథ్ ను దర్శనం చేసుకునేందుకు శుక్రవారం దాదాపు 10,000 మందికి పైగా భక్తులు వచ్చారు. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు ఈ నెల 8న తెరుచుకోనున్నట్టు అధికారులు వెల్లడించారు.