‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశాఖ పట్నంలో సందడి చేశారు. దీంతో ఆయనకి అల్లు అర్జున్ ఆర్మీ అదిరిపోయే వెల్కమ్ చెప్పింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బన్నీ క్రేజ్ ఏ రేంజ్ కు చేరుకుందో వీటిని చూస్తుంటేనే అర్థమవుతుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప-2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ లో భాగంగా మూవీ మేకర్స్ తో పాటు బన్నీ కూడా వైజాగ్ కి చేరుకున్నారన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వైజాగ్ లో బన్నీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అల్లు అర్జున్ ఎప్పుడు అక్కడికి చేరుకున్నా.. ఆయన ఆర్మీ ఘనంగా వెల్కమ్ చెబుతుంది. ఈసారి కూడా బన్నీ గురువారం రాత్రి సమయంలో వైజాగ్ కి చేరుకోగా.. అక్కడ ఆర్మీ తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
దీంతో బన్నీ క్రేజ్ ఎలా ఉందో మరోసారి కనిపించింది. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ లు ఈ చిత్రానికి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
Atu Offline…Itu Online 🙏❤️🔥
If we say he is NUMERO UNO
We Mean it!!!! @alluarjun 👑VIZAG AA Fans..🔥#PushpaTheRule @PushpaMovie pic.twitter.com/PdJ6c7vKIc
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) January 19, 2023