నాగ చైతన్య…అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా… ఈ యంగ్ హీరోకు ఇంతవరకు సరైన బ్లాక్ బాస్టర్ హిట్ దొరకలేదు. కెరీర్ మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న సరైన హిట్ లేక కెరీర్ ను నెట్టుకొస్తున్నారు. ఇటీవల మజిలీ, వెంకీ మామ సినిమాలతో హిట్ కొట్టినప్పటికీ, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి హీరోయిన్ గా ” లవ్ స్టోరీ ” సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత గీతగోవిందం దర్శకుడు పరశురామ్ సినిమాలో చైతు నటించనున్నాడు. ఈ సినిమాని 14 రీల్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకి నాగేశ్వర రావు అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ఇటీవల ఫిలింఛాంబర్ లో నాగేశ్వరరావు టైటిల్ ను రిజిస్టర్ చెయ్యటంతో ఆ సినిమా చైతుకోసమే అని ఫిలింనగర్ గుస గుసలు వినిపిస్తున్నాయి.
మరి పరశురామ్, చైతు సినిమాపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించాలిసిందే.