రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల నుంచి నిలబెట్టలనుకున్న అభ్యర్థులందరూ తప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు విపక్షాల అభ్యర్థిపై క్లారిటీ లేదు. నిన్నటి వరకు సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా పేరు వినిపించిది కాగా ఆయన తప్పుకుంటున్నట్లు తెలిపారు. మొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపించగా దాని మీద సరైన స్పష్టత లేదు. దీనికి ఆయన సుముఖత గా లేరు అన్న వార్తలు వచ్చాయి.
కాగా ఇప్పుడు తాజాగా గాంధీ మనవడు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించగా ఆయన కూడా అభ్యర్థి పోటీలో నిలిచేందుకు నిరాకరించారు. ఉమ్మడి ప్రతిపక్షం తరుఫున తన పేరును అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కానీ ఆ స్థానానికి మరో అభ్యర్థి పేరును పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల్లో జాతీయ ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థిని నియమించాలని ప్రతిపక్షాల ఐక్యతను నిర్థారించాలన్నారు. అందుకే అలాంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని ప్రతిపక్ష నేతలకు విన్నవించారు.
బ్రిటీష్ చివరి గవర్నర్ జనరల్‌గా పని చేసిన రాజాజీ వంటి వారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కోరారు. అంతేకాదు మొదట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అలంకరించిన పదవి అది అంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు.
Advertisements
గోపాలకృష్ణ గాంధీ దక్షిణాఫ్రికా, శ్రీలంక కు భారత హైకమిషనర్‌గా కూడా పని చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా కూడా గోపాల కృష్ణ పనిచేశారు. మొన్న శరద్ పవార్, నిన్న ఫరూక్ అబ్దుల్లా, నేడు గోపాల కృష్ణ గాంధీ కూడా.. ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేయడం ఎందుకు అంటూ ప్రతిపక్షాల అభ్యర్థులు అందరూ తప్పుకోవడం తో విపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.