టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంచి మనసును చాటుకున్నారు. భక్తుల ఇబ్బందులను కళ్లారా చూసిన ఆయన వెంటనే తగిన పరిష్కారం చూపించారు. తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న సమయంలో అలిపిరి నుంచి కాలినడకన వస్తున్న భక్తులు ఎండ వేడితో కాళ్లు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూశారాయన. వేసవి కాలం కావడంతో ఎండల ధాటికి భక్తులు నిప్పులపై నడిచినట్లు అల్లాడిపోవడాన్ని ఆయన గమనించారు.
వెంటనే భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నడక మార్గంలో మోకాలి మెట్టు నుంచి అక్క గార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్ మ్యాట్ వేసి నీరు చల్లించే ఏర్పాట్లు చేయాలని చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో వెంటనే స్పందించిన అధికారులు సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు 24 గంటల్లోనే గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. మ్యాట్ పై నీళ్లు చల్లుతూ భక్తుల ఇబ్బందులు తొలగించారు.
టీటీడీ ఛైర్మన్ సత్వర స్పందనపై భక్తులు ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ మ్యాట్ ఏర్పాటుతో ఎండ వేడి నుంచి రక్షణ కలుగుతోందని చెబుతున్నారు.