లఘ్నం చీర నచ్చలేదని పెళ్లి క్యాన్సలైన అరుదైన సంఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని హసన్ పట్టణానికి దగ్గర్లోని గ్రామానికి చెందిన బి.ఎన్. రఘుకుమార్, సంగీత అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. విషయాన్ని ఇరువురు తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. పెద్దల అంగీకారం మేరకు పెళ్లికి ముహుర్తం కూడా ఖరారు చేశారు. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా పెళ్లి బట్టల విషయంలో అబ్బాయి తల్లిదండ్రులకు, అమ్మాయి తల్లి దండ్రులకు గొడవ జరిగింది. లఘ్నం చీర బాగా లేదని అబ్బాయి తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లఘ్నం చీర బాగా లేనందున గురువారం జరగాల్సిన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. పెళ్లి కొడుకు పారిపోవడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రఘుకుమార్ పై చీటింగ్ కింద కేసు నమోదు చేసిఅతని కోసం గాలిస్తున్నట్టు హసన్ ఎస్పీ శ్రీనివాస గౌడ తెలిపారు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు.