కాస్సేపట్లో పెళ్లి. అందరూ మంటపానికి వచ్చేశారు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కూడా మంటపంలో వచ్చారు. పురోహితుడు ఇద్దర్ని బట్టలు మార్చుకొని రమ్మన్నారు. మరికొద్ది క్షణాల్లో పెళ్లి పూర్తవుతుంది. కానీ బట్టలు మార్చుకోవడానికి వెళ్లిన వరుడు బయటకు రాలేదు. ఓవైపు పెళ్లి కూతురు రెడీ అయి వచ్చి కూర్చున్న వరుడు రాకపోవటంతో బంధువులు వరుడు గది వద్ద ఎంత పిలిచినా బయటకు రాలేదు. డూప్లికేట్ కీ తో డోర్ తీసే సరికి ఫ్యాన్‌ను వేలాడుతున్నడు వరుడు.
మేడ్చల్ సమీపంలోని దూలపళ్లి వద్ద ఓ ఫంక్షన్ హల్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ లెక్చరర్ శ్రీనివాస్ చారి కుమారుడు సందీప్ సూసైడ్ చేసుకున్నారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సందీప్… తన తాతయ్య, అమ్మమ్మలతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. కానీ పెళ్లికి నెల రోజుల ముందు తాతయ్య మరణించటంతో పెళ్లిని వాయిదా వేసుకుందామని సందీప్ కోరినా ఇంట్లో వినలేదు. ఓవైపు తాతయ్య జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో… తట్టుకోలేక సందీప్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనగా… పోలీసులు కేసును నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.