నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్పీఎస్సీ. ఇటీవలే ఏఈ, గ్రూప్-1 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిన నేపథ్యంలో నిరుద్యోగులు ఆందోళన చెందారు. మరలా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారా? అంటూ దిగాలు పడిపోయారు. అయితే తాజా రిక్రూట్ మెంట్ కోసం ప్రశ్నా పత్రాన్ని సిద్ధం చేస్తోంది టీఎస్పీఎస్సీ. ఈ మేరకు పరీక్షా తేదీని ప్రకటించింది.
ఏప్రిల్ 4వ తేదీన ఏఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఏఈ విభాగంలో హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ లో 22 పోస్టులో, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ లో 113 పోస్టులు భర్తీకి పరీక్షను నిర్వహించనున్నారు.
సబ్జెక్ట్ నిపుణులతో తాజా ప్రశ్నాపత్రంను తయారు చేయిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రకటించిన తేదీ కన్ఫార్మ్ కాదని, కాకపోతే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది.
అలాగే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కాకపోతే ఈ పరీక్ష కోసం ఇప్పటివరకూ క్వశ్చన్ పేపర్ ని సిద్ధం చేయలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ద్వారా మొత్తం 23,050 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.