తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. గ్రూప్-2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. గ్రూప్-4 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
కాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువుల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి.
నియామకాల ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు పూర్తి చేసింది.