గ్రూప్ 4 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. తాజాగా గ్రూప్ 4 పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది. గ్రూప్ 4 పరీక్షను జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
గ్రూప్ 4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 8,180 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు జనవరి 30న చివరి తేదీగా ప్రకటించారు.
అయితే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గడువు తేదీని టీఎస్‌పీఎస్సీ పొడిగించింది. గడువును ఫిబ్రవరి 3వరకు పొడిగిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30 వరకు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు పెంచడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.