అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు జనసంచారంలోకి రావడంపై శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం రావిచంద్రి గ్రామస్థులు భయాందోళకు గురయ్యారు. ఏనుగుల మంద పంట పొలాల్లోకి వెళ్లి పంటను ధ్వంసం చేస్తేందేమోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగుల గుంపు జనావాసాల్లోకి వస్తుండటంతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అధికారులు బాంబులు పేల్చారు. అయినప్పటికీ ఏనుగుల గుంపు మాత్రం జనావాసాల్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిచడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఏ క్షణం ఎం జరుగుతుందోనని జంకుతున్నారు. గ్రామ పరిధిలోని చెరువులో ఏనుగులు తిష్ట వేశాయని… ఎన్నిసార్లు ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి మళ్లించిన తిరిగి అదే చెరువులోకి వస్తున్నాయని తెలిపారు.