నెల్లూరు జిల్లా లో రెండు గ్రామాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామ సరిహద్దులో ముళ్ల కంచెల వేయడంతో వివాదం చెలరేగింది.
వివరాల్లోకి వెళ్తే విడవలూరు మండలంలో సముద్రతీర గ్రామాలైన లక్షీపురం,కొత్తూరు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లతో కర్రలతో దాడులకు పాల్పడ్డారు. కరోనా వైరస్ నేపధ్యంలో రెండు గ్రామాల సరిహద్దు లలో ముళ్ల కంచెలు వేయడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పదుల సంఖ్య లో ఇరు గ్రామస్థులు గాయపడ్డారు. సంఘటనా స్దలం కు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులో ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.