గత ఏడాది అప్ఘానిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి తాలిబన్లు రోజుకో కొత్త నిబంధన.. పూటకో న్యూ రూల్‌తో ప్రజలను నానా ఇబ్బంలు పెడుతున్నారు. ఇప్పటికే ఉన్న ఆంక్షలతో అక్కడి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి.. బహిరంగ జైలులో బతుకుతున్నామని ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా తాలిబన్ పాలకులు అడ్డూ అదుపు లేని నిబంధనలతో మహిళలను బంధిస్తున్నారు. మహిళల మాట, చేతలను కట్టడి చేసేఇప ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా పురుషులపైనా కొత్త నిబంధనలు విధించారు.
‘ప్రభుత్వ ఉద్యోగులు గడ్డాలు లేకుండా ఆఫీసుకు రావొద్దు అని ఒకవేళ ఈ నిబంధన అతిక్రమించి గడ్డం లేకుండా ఆఫీసుకు వస్తే వారిని ఉద్యోగంనుంచి తీసివేస్తాం’అని తాలిబన్ పాలకులు ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని ప్రభుత్వ కార్యాలయాలల్లో తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే గడ్డం లేకుండా ఉన్న ఉద్యోగులపై తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవ్వరు గడ్డం గీసుకోవద్దు అని హుకుం జారీ చేశారు. అలాగే, విదేశీ దుస్తులను ధరించకూడదని, ఉద్యోగులంతా సంప్రదాయ దుస్తులనే ధరించాలని ఆదేశించారు. పొడవాటి, వదులుగా ఉండే టాప్, ప్యాంటు, టోపీ లేదా తలపాగాతో కూడిన స్థానిక దుస్తులతోనే ఆఫీసులకు రావాలని ఆర్డర్ పాస్ చేశారు. ఈ డ్రెస్ కోడ్‌ను పాటించకపోతే ఇక నుంచి ఆఫీసుల్లోకి ప్రవేశించలేరని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
తాలిబన్ల పాలనపై మొదటి నుంచి అనుమానులు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో వీరి నిబంధనలు ఎలా ఉంటాయోననే భయం మొదలైంది. భయపడినట్లుగానే తాలిబన్లు రోజుకో నిబంధన విధిస్తూ వస్తున్నారు. బాలికల విద్యను రద్దు చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు మూసేసింది . అలాగే, మగతోడు లేకుండా విమానాలు ఎక్కొద్దని మహిళల కాళ్లకు సంకెళ్లు వేశారు. విమానాలు ఎక్కవనివ్వలేదు. మహిళలు వేసుకునే దుస్తులపై కూడా తాలిబన్లు నిబంధనలు పెట్టారు. వీటిపై ఇంకా అక్కడ నిరసలు, ధర్నాలు జరుగుతున్నాయి.
అంతేకాదు గత కొన్ని రోజుల క్రితం తాలిబన్లు మహిళలు పురుషులు కలిసి పార్కులకు వెళ్లకూడదని వేరు వేరుగా పార్కులకు వెళ్లాలని హకుం జారీ చేశారు. మహిళలు వారానికి మూడు రోజులు, అదే మగవాళ్లు వారం ఆఖరిలో నాలుగు రోజులు పార్కులకు వెళ్లాలని ఇద్దరు కలిసి పార్కులకు వెళ్లకూడదని, వారు వివాహితులు అయినాసరే మహిళలు, పురుషులు కలిసి పార్కులకు వెళ్లకూడదని కూడా రూల్ పాస్ చేశారు.