టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు స్వర్ణ పతాకాన్ని తీసుకువచ్చిన నీరజ్ చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో నీరజ్ కు ఒకప్పుడు లక్ష మంది ఫాలోవర్స్ ఉండగా ఇప్పుడు 28 లక్షల మంది ఫాలోవర్లు అయ్యారు. అంతే కాకుండా ట్విట్టర్ లో మూడు లక్షల మందికి నీరజ్ కు ఫాలోవర్స్ అయ్యారు.
ఇక తన తదుపరి లక్ష్యం 90 మీటర్లనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నీరజ్ వెల్లడించారు. ఒలంపిక్స్ లో వచ్చిన పథకాన్ని రాత్రంతా దిండు కింద పెట్టుకుని నిద్రపోయా అని తెలిపాడు. ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీగా మారిన నీరజ్ చోప్రా బయోపిక్ త్వరలోనే వస్తుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బయోపిక్ పై కూడా నీరజ్ స్పందించాడు.
Advertisements
తన బయోపిక్ గనక తెరకెక్కిస్తే అందులో హీరోగా రణదీప్ హూడా లేదంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని చెప్పాడు. అంతేగాకుండా బాలీవుడ్లో తనకు ఇష్టమైన హీరో అక్షయ్ కుమార్ అని ఆయనకు పెద్ద అభిమానిని అని తెలిపాడు. ఇక నీరజ్ మాటలు చూస్తుంటే ఒకవేళ ఆయన బయోపిక్ రావడం జరిగితే అందులో హీరోగా అక్షయ్ కుమార్ నటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.