దేశవ్యాప్తంగా నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరగ్గా… తెలంగాణలో మాత్రం తగ్గాయి. గతేడాది నవంబరుతో పోలిస్తే రాష్ట్రంలో వసూళ్లు పడిపోయాయి. ఇదే సమయంలో ఏపీలో మాత్రం భారీ పెరుగుదల కనిపించింది. నవంబర్ నెలకుగానూ అన్ని రాష్ట్రాల్లో కలిపి రూ. 1.04 లక్షల కోట్లు జీఎస్టీ వసూలు అయినట్టు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
ఆ లెక్కల ప్రకారం 2019 నవంబరుతో పోలిస్తే తెలంగాణ వసూళ్లు రూ.3,349 కోట్ల నుంచి రూ.3,175 కోట్లకు (-5%) తగ్గాయి. అదే ఏపీలో వసూళ్లు 12% పెరిగాయి. గత ఏడాది ఏపీలో రూ.2,230 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.2,507 కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా కూడా గతేడాది కంటే ఈసారి జీఎస్టీ వసూళ్లు 1.42% వృద్ధి చెందాయి