సినిమా వాళ్లపై జీఎస్టీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లావణ్య త్రిపాఠి సహా పలువురు సెలబ్రిటీలు, విద్యాసంస్థల అధినేతలు, మూవీ మేకర్స్‌పై సోదాలు జరగ్గా… తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇంట్లోనూ సోదాలు కొనసాగినట్లు తెలుస్తోంది.
హారికా హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కార్యాలయాల్లో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారని, ఆ క్రమంలోనే వారికి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ఇంట్లోనూ జీఎస్టీ సోదాలు జరిగాయని ప్రచారం సాగుతోంది. అంతేకాదు మరో స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఇళ్లపైనా జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే జీఎస్టీ అధికారులు ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.