ఓ వైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఇలాంటి సమయంలో సామాన్యుడికి మరో షాక్ తగిలింది.
ఇటీవల నిత్యావసరాలు, సేవలపై జీఎస్టీ ధరలను కేంద్రం పెంచింది. పెంచిన రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది.
తాజా నిర్ణయంతో ప్యాకింగ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తో పాటు, పాలు, పెరుగు, ఆస్పత్రి గదులు, హోటల్ రూంలు , ఎల్ఈడీ ల్యాంప్ లు, గృహోపకరణాలు, నిత్యావరసరాలు, బ్యాంక్ సేవలు, మాంసం, తృణ ధాన్యాల ధరలు మరింత పెరగనున్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన అధిక పన్ను రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులపై మరింత భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రింటింగ్, ఎల్ఈడీ ల్యాంప్స్, కత్తులు, చెంచాలు, వాటర్ పంపులు, డెయిరీ మెషినరీ, టెట్రా ప్యాక్ ల్లో ఉండే పెరుగు, పాలు, లస్సీ, సోలార్ వాటార్, అట్లాస్, మ్యాప్, హోటల్ గదుల ధరలు,బ్లేడ్లు, పేపర్ కటింగ్ కత్తెరలు మొదలైన వాటి ధరలు పెరగనున్నాయి.