కొత్త నిబంధనల ప్రకారం జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయని వారి ఆస్తులను, బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసే అధికారాలను సిబ్బందికి అప్పగిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎస్టీ రిజిస్టర్ చేసుకున్న కోటి సంస్థల్లో చాలా వరకు రిటర్న్స్ దాఖలు చేయడం లేదు. దీంతో పలు మార్లు గుర్తు చేసినప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయని వారి ఆస్తులను సీజ్ అధికారాలను కొత్తగా రూపొందించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇకపై జీఎస్టీ పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించనుంది.