మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ఈ ఏడాది జూలైలో గరిష్ఠంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇది జీవిత కాల రెండో గరిష్ఠమని ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది ఇదే నెలలో వసూలైన జీఎస్టీతో పోలిస్తే ఈసారి 28% శాతం అధికంగా రాబడి వచ్చినట్టు పేర్కొంది.
సీజీఎస్టీ 25వేల 751 కోట్లు, ఎస్ జీఎస్టీ 32వేల 807 కోట్లు, సెస్ రూపంలో 10వేల 920 కోట్లు, ఐజీఎస్టీ 79వేల 518 కోట్లు వసూలయ్యాయని ఆర్థిక శాఖ తెలిపింది.
తెలంగాణ నుంచి జూలైలో రూ. 4వేల 547 కోట్ల జీఎస్టీ వసూలైందని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నెలతో పోల్చితే ఈ సారి అధికంగా జీఎస్టీ వసూలైనట్టు చెప్పింది. గతేడాది జూలైలో వస్తు, సేవల పన్ను వసూళ్లు రూ. 1,16,393 కోట్లుగా ఉన్నాయి.