‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ అంటూ ఇడియట్ సినిమాలో రవితేజా టీజ్ చేస్తాడు. ఈ సాంగ్ చాలామందికి పేవరేట్ సాంగ్! ఇక్కడ మేటర్ ఏంటంటే ఈ సాంగ్ కాదు. ‘గుచ్చి’ మష్రూమ్! ఇవి చాలా హాట్ కేక్ అండీ ఢిల్లీ సూపర్ మర్కెట్స్‌లో. కొందామా అంటే చాలా రేట్ కూడా..! కిలో జస్ట్్ 40 వేలే !
ఇంత రేటు పెట్టి ఎవరు కొంటారు, ఎవరు తింటారు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే గుచ్చి మష్రూమ్స్ చాలా రేర్ ప్రొడక్ట్. దీనికి వున్న పాపులారిటీయే వేరు. జమ్మూకాశ్మీర్ హిమాలయాలలోని కానిఫర్ అటవీ ప్రాంతంలో ఇవి అరుదుగా దొరుకుతాయి. చాలా సహజసిద్దంగా పెరుగుతాయి.
అక్కడి మహిళలు జీవనోపాధి కోసం వీటిని సేకరించి 4 నుంచి 5 వేలు చొప్పున అమ్ముతారట. అవి ఢిల్లీ మార్కెట్ చేరేసరికి 40 వేలు అవుతుంది.
ఇక, గుచ్చి మష్రూమ్స్ టేస్ట్ చాలా బాగుంటుందని అంటారు. వీటిని మందుల్లో కూడా వాడతారు. కూర వండుతారు. బిరియానీగా కూడా బావుంటుంది. మాంచి టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. వీటికి డైరెక్ట్ మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే స్థానిక మహిళలతో పాటు ఢిల్లీ వినియోగదారులకు గుచ్చి మష్రూమ్స్ మరింత తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.