నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, లుక్స్, ట్రైలర్స్ సాంగ్స్ అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జనవరి 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
అయితే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు అని అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక కీర్తి సురేష్ ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడి ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్.