మహానటి సినిమా తో ఉత్తమ నటిగా పేరుతెచ్చుకుంది కీర్తి సురేష్. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొడుతోంది. కాగా నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం గుడ్ లక్ సఖి.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి దేశం గర్వించదగ్గ షూటర్ గా ఎలా మారనుంది అనేది ఈ కథాంశం.
నిజానికి ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు ఎట్టకేలకు జనవరి 28 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు మేకర్స్.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు.