నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఈ చిత్రం జనవరి 28న భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఆది పినిశెట్టి, జగపతిబాబులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం రకరకాల కారణాలతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
ఈ నేపథ్యంలోనే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను అంటూ జగపతిబాబు డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
ఇక ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈ చిత్రం పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి యు సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఇక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.