గూడూరు నారాయణ రెడ్డి పీసీసీ కోశాధికారి
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ చేపట్టిన #AskKTR ఒత్తి ప్రచారం మాత్రమే. ఇది వార్తా పత్రికలలో వార్తలు రాసుకోడానికి పనికొచ్చే పబ్లిక స్టంట్ తప్ప మరొకటి కాదు. ప్రచార ఆర్భాటానికి కాకుండా ప్రజలకు సేవలు అందించే విధంగా మంత్రి కేటీఆర్ పని చేయాలి. మంత్రి కేటీఆర్ తక్షణమే తన కార్యాలయ అడ్రస్ మీడియాకు తెలియచేసి జనానికి తెలిసేట్లు చూడాలి. కేటీఆర్‌కు ఎన్ని ప్రశ్నలు వచ్చినా…ముందే ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే ప్రత్యుత్తరాలు ఇస్తారు. రాష్ట్ర మంత్రిగా కార్యాలయంలోకాని, ఇంటి వద్దకాని ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజావినతులు స్వీకరించేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా నిర్ణీత సమయాలను కేటాయించాలి.
కాని మంత్రి కేటీఆర్‌కు కార్యాలయ అడ్రస్ లేదు. సచివాలయం లేక…చాలా మంది మంత్రులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక కార్యాలయాలతో పని చేస్తున్నారు. మున్సిపల్ శాఖతోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కెటిఆర్
పరిణతి చెందిన మంత్రిగా పనిచేయాలి. ప్రజలతో తత్సంబంధాలు కలిగి ఉండడానికి బదులు, కేటీఆర్ సోషల్ మీడియాలో స్టంట్లు చేయడంపై దృష్టి పెట్టారు. ట్విట్టర్‌కాని, ఇతర సామాజిక మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే లోకజ్ఞానం జనానికి లేదు. పేదలు ఎప్పుడు కూడా వారి మనోవేదనలను స్వయంగా విని పరిష్కరించగల ప్రజాప్రతినిధి కావాలని కోరుకుంటారు. మరొక వైపు, సిఎం కెసిఆర్, కెటిఆర్, ఇతర మంత్రులు…తమ ప్రభుత్వం బాగానే పని చేస్తుందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటారు.
కేటీఆర్ ఒక నటుడిగా కాకుండా ప్రజా ప్రతినిధిలా ప్రవర్తించడం నేర్చుకోవాలి.