స్మార్ట్ ఫోన్ లేకుండా మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సరే ఇంట్లో కూడా అది లేకుండా ఉంటామా అంటే కాలకృత్యాల సమయంలో కూడా దానితోనే సమయం గడుపుతూ ఉంటాం. బ్రష్ చేస్తున్నామో బ్రష్ నములుతున్నామో కూడా అర్ధం కాదు. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వినోదం కూడా ఎన్నో అందుబాటులో ఉంటున్నాయి.
Also Read:చాణక్య నీతి: ఉదయం లేచి ఇలాంటి పనులు చేస్తే మీ భవిష్యత్ బంగారమే !
ఫన్ తో పాటుగా వినోదం తో పాటుగా మెదడుకి మేత వేయడానికి ఫోటో ఫజిల్స్, ఆఫ్టికల్ ఇల్యూషన్స్ ఎన్నో ఉంటాయి. ఫోటో ఫజిల్ ఒక ఎత్తు అనుకుంటే ఆఫ్టికల్ ఇల్యూషన్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. ఇవి మన కళ్ళను కూడా మోసం చేస్తూ ఉంటాయి. పైకి కనపడేది ఒకటి అయితే లోపల ఉండేది మరొకటి. ఆఫ్టికల్ ఇల్యూషణ్ పజిల్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. వీటిని సాల్వ్ చేయాలి అంటే మన కళ్ళకు పదును ఉండాలి.
అలాంటి కోవకు చెందిన పజిల్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. పైన పేర్కొన్న ఫోటో ని గమనిస్తే బ్లాక్, వైట్ కలర్ సర్కిల్స్ తో పాటుగా అందులో ఒక జంతువు కూడా ఉంటుంది. అక్కడ మీకు కనపడే జంతువు ఏంటో చెప్పాలి. మీ కంటికి ఇది నిజంగానే ఒక పరీక్షా. మీరు ఆ ఆఫ్టికల్ ఇల్యూషన్ ను గమనిస్తే అందులో ఉండే చక్రాలు తిరుగుతున్నట్టు ఉంటుంది. చాలా మంది అందులో జంతువు ఎం లేదు అంటారు. కాని అందులో జంతువు కనపడితే మీ కళ్ళల్లో ఏదో ఉన్నట్టే.
Also Read:హైవేల నిర్మాణ జాప్యంపై రేవంత్ ఆగ్రహం..!