బాడీబిల్డర్ల మధ్య ఓ కాలులేనప్పటికీ ఠీవీగా నిలబడ్డ ఈమె పేరు జుయ్ యూన్… చైనాలోని నైనింగ్ ప్రాంతంలో జన్మించిన యూన్ ఆత్మవిశ్వాసానికి ప్రతీక… చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి సంరక్షణలో పెరిగిన యూన్ ఓ రోడ్డు ప్రమాదంలో తన కాలు పోగొట్టుకుంది. తోటి ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తుంటే…ఏదైనా సాధించాలని భావించింది. బాడీ బిల్డింగ్ పై దృష్టిపెట్టింది.
అలా ….2001 పారా ఒలంపిక్స్ లో పాల్గొన్న యూన్ కు గుర్తింపువచ్చింది. అప్పటి నుండి కఠోర శ్రమతో నిత్యం వ్యాయామంతో గోల్డ్ మెడల్ సాధించాలన్న ఆకాంక్షతో ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు 2004 ఎథెన్స్ పారా ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది యూన్! 2008 సమ్మర్ ఒలంపిక్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది యూన్….ఇలా ఓ కాలు లేనప్పటికీ ఎందరికో ఆదర్శంగా నిలిచింది.