గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనాస్కాంఠా జిల్లా అంబాజిలోని త్రిషులియా ఘాట్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు. మరో 50 మంది గాయపడ్డారు.
గాంధీనగర్: గుజరాత్‌లో జరిగిన భారీ రోడ్డు ప్రమాదం 21 మందిని బలితీసుకుంది. బనాస్కాంఠా జిల్లా అంబాజీ ప్రాంతంలోని త్రిషులియా ఘాట్ సమీపంలో ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగేట్టు వుందని అధికారులు చెబుతున్నారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వర్షాలతో బస్సును అదుపు చేయడంలో డ్రైవర్ వల్ల కాలేదని, అందువల్లే ప్రమాదం జరిగివుంటుందని చెబుతన్నారు. ఈ బస్సులో మొత్తం 70 మందికి పైగా ప్రయాణికులున్నారని అంటున్నారు.