గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని పాండెసరాలోని ఓ టెక్స్‌టైల్ మిల్లులో శనివారం అర్థ రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు మిల్లు అంతటా వ్యాపించాయి.
భారీగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంత మంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు సమాచారాన్ని ఫైర్ సిబ్బందికి అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరించన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
యూపీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. హాపూర్ జిల్లా దోలానాలోకి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి పెద్ద ఎత్తున అగ్ని కీలలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో ఎనిమంది మరణించారు.