గుజరాత్‌లో ముస్లిం యువకులను పోల్‌కు కట్టేసి కొట్టిన ఘటనపై మైనార్టీ కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి మైనార్టీ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ నోటీసులు జారీ చేశారు.
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గర్బా వేడుకల్లో కొందరు ముస్లిం యువకులు అల్లరి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాళ్లను పట్టుకుని పోల్ కు కట్టేసి చితక బాదారు. స్థానికులు చప్పట్లు కొడుతుండగా ఆ యువకుల్ని చితక బాదారు.
దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఘటనపై ఆ రాష్ట్ర డీజీపీ ఆశిష్ భాటియా విచారణకు ఆదేశించారు.
విచారణలో యువకుల్ని లాఠీలతో పోలీసులు లాఠీలతో కొట్టినట్టు నిర్దారణకు వచ్చారు. ఈ క్రమంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. దీనిపై ఓ ఎన్జీవో సంస్థ రియాక్ట్ అయ్యింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీకి లీగల్ నోటీసులు ఎన్జీఓ పంపింది. బహిరంగంగా యువకులను చితకబాదిన ఘటనలో డీజీపీతో పాటు పలువురు పోలీసు అధికారులకు మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ కోర్టు ధిక్కరణ నోటీసులను పంపించారు.