గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీదే పై చెయ్యి అని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మెజార్టీ సంస్థలిచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుజరాత్ లో తిరిగి బీజేపీయే పగ్గాలు చేపడుతుందని స్పష్టమవుతుంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం 182 స్థానాలకు భాజపా 125 నుంచి 143 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు అంచనాలు వేస్తున్నాయి.
త్రిముఖ పోటీలో.. కాంగ్రెస్ కు 30 నుంచి 48 స్థానాలు, ఆప్ మూడు నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం భాజపా 130 నుంచి 145 సీట్లు గెల్చుకోనుంది. కాంగ్రెస్ 25 నుంచి 35 సీట్లు, ఆప్ 5 నుంచి 7 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడైంది.
ఇక ఆత్మసాక్షి సర్వే ప్రకారం భాజపాకు 98 నుంచి 110 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు 66 నుంచి 71 స్థానాలు వస్తాయని, ఆప్ కు 9 నుంచి 14 సీట్లు వస్తాయని అంచనా. న్యూస్ ఎక్స్ ప్రెస్ సర్వే ప్రకారం..బీజేపీ 117 నుంచి 140 సీట్లు సాధించనుంది. కాంగ్రెస్ 34 నుంచి 51 , ఆప్ కు 6 నుంచి 13 సీట్లు వస్తాయని తేల్చడం జరిగింది.
ఇక పలు నేషనల్ టీవీ ఛానల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా కూడా.. కమలానిదే పై చెయ్యి కనిపిస్తోంది. దీంతో మొత్తానికి మరో సారి గుజరాత్ లో బీజేపీయే అధికారాన్ని చేజిక్కించుకోబోతుందని స్పష్టమవుతుంది.