గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి బెయిల్ లభించింది. అసోంలోని బార్ పేట జిల్లాలో మహిళా పోలీసుతో అసభ్యకరంగా ప్రవర్తించారన్న కేసులో ఆయనకు బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.
ప్రధాని మోడీపై అభ్యంతరకర ట్వీట్ చేశారన్న ఆరోపణల మేరకు ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసులో ఆయనకు కోక్రజహార్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
దీంతో ఆయనకు విడుదలయ్యారు. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. విడుదలైన కొద్ది సేపటికే ఆయనపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ని అరెస్టు చేశారు.
ఎమ్మెల్యేను అరెస్టు చేసి గుజరాత్ నుంచి తీసుకువస్తున్న సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ తో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో బెయిల్ లభించడంతో ఆయన విడుదల కానున్నారు.